తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ అందులో కొంత మంది మాత్రమే ఇటు సినిమాల్లో హీరో గా నటిస్తూ ... అటు సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉంటారు. అలా సినిమాలో హీరో గా నటిస్తూ అప్పుడప్పుడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యువ హీరో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ ఆ తర్వాత పలకనామ దాస్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

అలాగే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో భారీ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. ఆ తర్వాత విశ్వక్ అనేక సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఏ మూవీ కి కూడా ఈ యువ హీరో దర్శకత్వం వహించలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మార్చ్ 22 వ తేదీన విడుదల కాబోతుంది. నివేత పెత్ రాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తో అయినా విశ్వక్ దర్శకుడిగా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: