తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నితిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా నితిన్ "మాచర్ల నియోజకవర్గం" అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. భారీ అంచనాలను నడుము విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూప లేదు. ఇది ఇలా ఉంటే నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 32 వ మూవీ గా రూపొందుతుంది.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో శ్రీ లీల ... నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను ఈ నెల 29 వ తేదీన లేదా 30 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనున్నట్లు ఒక వార్త తాజాగా బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: