ఈ మధ్యకాలంలో దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు నటీనటుల మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందరి నటీనటుల మీద తనకు నచ్చిన ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఉమైర్ సంధు కే జి ఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె యష్ తో పనిచేయడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిందని, అతనితో మరొకసారి పనిచేయని చెబుతోందని ఆరోపించారు.

అతను టాక్సిస్ అని.. హెరాస్ చేసే వ్యక్తి అని ఆమె చెప్పినట్లుగా ఉమైర్ తెలియజేయడం జరిగింది.  అయితే ఈ విషయంపై తాజాగా శ్రీనిధి శెట్టి స్పందించడం జరిగింది.. పెద్దలు అంటూ ఉంటారు.. వస్తువు ఎలా ఉందనేది కాకుండా అది ఎవరి చేతిలో ఉందనే విషయం ఆ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని.. కొంతమంది సోషల్ మీడియాలో ద్వేషాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను మాత్రం ప్రేమను నా జీవితంలో ఎదగడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి వీటిని వాడుకుంటూ ఉంటానని రాసుకుంది.

అయితే పదే పదే చెబుతున్నాను అనుకోకపోతే కేజీఎఫ్ వరల్డ్ కోసం యష్ గారితో పని చేయడం నిజంగా ఒక అద్భుతం.. గౌరవం.. ఆయనతో పనిచేయడం అదృష్టమని తెలిపింది.. నిజంగా ఆయన ఒక జెంటిల్మెన్.. ఒక స్నేహితుడుగా , ఇన్స్పిరేషన్ గా మీ అభిమానురాలని అంటూ శ్రీనిధి కామెంట్లు చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పటివరకు ఉమైర్ సంధు చేసిన ట్వీట్లకి ఎవరూ కూడా స్పందించలేదు.  కానీ ఎట్టకేలకు ఈ అమ్ముడు స్పందించడంతో ఈ ఆరోపణలు నిజం కాదు అనే విషయంపై గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది. దీంతో హీరో హీరోయిన్ల మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: