కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అశేష ప్రేక్షకగణం ఆ సూపర్ స్టార్ ని నేడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్, నిర్మాత పార్వతమ్మ రాజ్ కుమార్ దంపతులకు 1975 మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ గారు జన్మించారు. ఆయన ఐదుగురు తోబుట్టువులలో చిన్నవాడు. కేవలం 6 నెలల వయసులో ప్రేమద కనికే సినిమాలో కనిపించారు. చిన్నప్పటి పునీత్ తన సోదరి పూర్ణిమతో కలిసి సినిమా సెట్స్‌కి వచ్చేవారు. అందుకే ఆయన మనసు ఎప్పుడూ కూడా సినిమాలపైనే నిమగ్నమై ఉండేది. ఈ కారణంగా, ఆయన చిన్న వయస్సులోనే పాఠశాలను విడిచిపెట్టారు.అయితే, తరువాత  ట్యూటర్ సహాయంతో తన చదువును పూర్తి చేశారు.అలాగే కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా కూడా చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో పనిచేశారు.పునీత్ రాజ్ కుమార్ గారు కేవలం నటుడు మాత్రమే కాదు.. ఫిలాంత్రపిస్ట్, సింగర్, వ్యాఖ్యాత, నిర్మాత కూడా. చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.


2002 వ సంవత్సరంలో వచ్చిన 'అప్పు' సినిమాతో లీడ్ హీరోగా కన్నడ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పునీత్, మూడు దశాబ్దాల సినీజీవితంలో ఒక నేషనల్ అవార్డు, 4 కర్ణాటక రాష్ట్ర అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, 5 సైమా అవార్డులు ఇంకా ఇంకా కర్ణాటక రత్న అవార్డును కూడా అందుకున్నారు.పునీత్ గారు కన్నడలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు, ఆయన 14 సినిమాలు వరుసగా 100 రోజులు థియేటర్లలో ఆడి ఇండస్ట్రీ హిట్లు కొట్టాయి. పునీత్‌ గారికి అభిమానుల క్రేజ్ అతని నటన వల్ల మాత్రమే కాదు. నిజ జీవితంలో కూడా ఆయన అంతే రియల్ హీరో కావడం వల్ల కూడా వచ్చింది. సామాజిక సేవ కోసం 26 అనాథాశ్రమాలు ఇంకా 46 పేద పిల్లల కోసం ఉచిత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. పునీత్ గారు తన కళ్లను దానం చేశారు. ఆయన మరణానంతరం పునీత్ మార్గాన్ని అనుసరించాలని భావించి కర్ణాటక రాష్ట్రం వ్యాప్తంగా 1 లక్ష మంది ప్రజలు తమ కళ్లను దానం చేశారు అభిమానులు. దీంతో కర్నాటకలో నేత్రదానం అకస్మాత్తుగా చాలా రెట్లు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: