కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం మోహన్ బాబు సోలోగా హిట్ అందుకొని చాలా కాలం అయింది. మోహన్ బాబు ఈ మధ్య కాలంలో సోలో హీరోగా నటిస్తూనే కొన్ని మూవీల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు క్రేజీ సినిమాల్లో కీలక పాత్రలలో నటించిన మోహన్ బాబు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మోహన్ బాబు "శాకుంతలం" అనే మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ప్రధాన పాత్రలో నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం మోహన్ బాబు కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే మోహన్ బాబు ఈ సినిమాలో చేస్తున్న పాత్రకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో మోహన్ బాబు "సాగే దుర్వాస" అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మోహన్ బాబు కు సంబంధించిన ఈ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: