టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని మంచి గుర్తింపు ను సంపాదించుకున్న అతి కొద్ది మంది దర్శకుల లో వెంకి కుడుముల ఒకరు . ఈ దర్శకుడు నాగ శౌర్య హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన ఛలో మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు . ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది .

ఛలో మూవీ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత నితిన్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా  భీష్మ అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా కెరియర్ లో దర్శకత్వం వహించిన రెండు మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని నితిన్ తోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నితిన్ కు వెంకీ ఒక కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన నితిన్ వెంటనే వెంకీ దర్శకత్వంలో  మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది  ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మూవీ ని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: