టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే మాచర్ల నియోజకవర్గం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను ప్రారంభించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 32 వ మూవీ గా రూపొందుతుంది.

శ్రీ లీల ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి ఇప్పటికే నితిన్ కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ సంస్థ నిర్మించబోయే మరో మూవీ లో కూడా నితిన్ నటించడానికి ఇప్పటికే ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ రెండు మూవీ లకు సంబంధించిన అప్డేట్ లు కూడా మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాపుతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లతో పాటు నితిన్ మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... నితిన్ తాజాగా ఠాగూర్ మధు బ్యానర్ లో తెరకెక్కబోయే మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యానర్ లో నితిన్ హీరోగా రూపొందిపోయే సినిమా పిరియాడిక్ ప్లస్ పునర్జన్మల బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం నితిన్ వరుస మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: