
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడంతో అటు మెగా అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పైన ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ఈ సినిమా పైన సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేయడం జరిగింది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రామ్ చరణ్ ను కలవడం జరిగింది చరణ్ తో పాటు చిరంజీవిని కూడా అమిత్ షా కలిశారు.అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
RRR చిత్రంలో రామ్ చరణ్ నటనను అభినందించారు అమిత్ షా అలాగే నాటు నాటు పాటకు కూడా ఆస్కార్ రావడం పై అమిత్ షా అభినందనలు తెలియజేయడం జరిగింది. అమిత్ షా చరణ్ ను శాలువాతో సత్కరించారు. ఇక ఆ పక్కనే ఉన్న చిరంజీవి చాలా మురిసిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో అభిమానులు ఈ అరుదైన ఘటనను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న RC -15 చిత్రంలో నటిస్తున్నారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.