
అగ్ర హీరో లతో పాటు యంగ్‌స్టర్స్ తో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న సినిమా లో శ్రీలీల కీలక పాత్ర లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమాలో శ్రీలీల బాక్సర్ పాత్ర చేస్తోన్నట్లు సమాచారం. ఈ రోల్ కోసం ఆమె బాక్సింగ్ పాఠాలు నేర్చుకుంటోన్నట్లు తెలిసింది. ఇందులో అల్లరి మనస్తత్వం తో పాటు ఆత్మస్థైర్యం కలబోసిన డిఫరెంట్ క్యారెక్టర్ లో శ్రీలీల కనిపించ బోతున్నట్లు సమాచారం.ఐతే శ్రీలీల నటన ఈ మూవీ కి ప్రధాన ఆకర్షణ గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.ఈ సినిమా లో బాలకృష్ణ కూతురి గా శ్రీలీల నటిస్తోన్నట్లు ప్రచారం జరుగు తోంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ లో గత వారమే జాయినైంది శ్రీలీల. ఈ మూవీ శ్రీలీల కేరిర్ ను ఇంకో మెట్టు పైకి ఎక్కిస్తుంది అని అభి మానులు భావిస్తున్నారు.
ఈ సినిమా కోసం ఆమె ముప్పై రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు చెబు తున్నారు. ఎన్‌బీకే 108 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.కాగా ప్రస్తుతం మహేష్ - త్రివిక్రమ్ మూవీతో పాటు వైష్ణవ్ తేజ్, నితిన్, నవీన్ పొలిశెట్టి లతో సినిమా లు చేస్తోంది శ్రీలీల. వీటి తో పాటు మరో నాలుగు సినిమాల్ని ఆమె అంగీక రించినట్లు సమాచారం.