తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మురుగదాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లతో తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మురుగదాస్ కేవలం తమిళ భాష సినిమాలకు మాత్రమే కాకుండా ఇప్పటికే స్ట్రేట్ తెలుగు మూవీకి కూడా దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన స్టాలిన్ అనే తెలుగు మూవీ కి దర్శకత్వం వహించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.  ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఆఖరుగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన దర్బార్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఇలా దర్బార్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటివరకు మురగదాస్ తన తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించలేదు.

ప్రస్తుతం మురుగదాస్ తన తదుపరి మూవీ కి సంబంధించిన కథను ఫైనల్ చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఒక స్టార్ డైరెక్టర్ కు సినిమా లేకపోతే అతని బృందానికి కూడా ఏలాంటి పని ఉండదు. దానితో వారికి కూడా డబ్బుల విషయంలో చాలా కష్టాలు వస్తాయి ... కానీ ఈ దర్శకుడు మాత్రం తనకు సినిమా లేకపోయినా తన దగ్గర ఉండే కోర్ టీం కు దర్బార్ సినిమా పూర్తి అయినప్పటి నుండి నెల నెలకు జీతాలు ఇస్తూ ... వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇలా తన టీం ను ఎంతో బాగా చూసుకుంటున్న మురుగదాస్ కు ఈ విషయంలో హాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: