
ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత కానీ వారికి విజయం లభించదు.ఈ జాబితాలో మృణాల్ ఠాకూర్ మొదటి వరుసలో ఉంటుంది. బుల్లితెరపై తన కెరీర్ మొదలు పెట్టిన మృణాల్ సీతారామంతో టాప్ హీరోయిన్‌గా మారిపోయిందని చెప్పవచ్చు..
ఎన్నో ఏళ్లుగా రాని గుర్తింపు ఒక్క సినిమాతో రావడంతో తనకీ అవకాశం ఇచ్చిన టాలీవుడ్‌కు ఎంతో కృతజ్ఞతల ను తెలిపింది. హైదరాబాద్ తన రెండో ఇల్లు అని కూడా చెప్తూ ఉండే మృణాల్ ఠాకూర్ తాజాగా నగరంలో ఓ ఇల్లు కొనుగోలు చేసిందని సమాచారం.సౌత్‌లో వరుస అవకాశాలు వస్తుండటంతో ఇక్కడికే మకాం మార్చాలనుకుంటోందట ఈ హాట్ బ్యూటీ.ఈ క్రమంలోనే తను ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు కూడా ఫిల్మీ నగర్ లో ఓ వార్త బాగా వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలి మరి.
మృణాల్ తన సినీ ప్రయాణం ఇలా సాగించింది...
ముజే కుచ్ కేతి.. యే ఖామోశ్యాన్ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించిందటా మృణాల్. తర్వాత కుంకుమ భాగ్య ధారావాహికలో కూడా మెరిసింది. ఈ సీరియల్ ఆమెకు మంచి పేరు ను తెచ్చిపెట్టింది. అనంతరం లవ్ సోనియా(2018) చిత్రంతో వెండితెరపై కూడా కనిపించింది. సూపర్ 30 మరియు బాట్లా హౌస్ వంటి చిత్రాలు చేసినా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో మృణాల్‌కు టాలీవుడ్ నుంచి పిలుపు కూడా వచ్చింది.
సీతారామం సినిమాతో తన దశ తిరిగిందని చెప్పాలి. ఈ మూవీలో నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టిన ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.ప్రస్తుతం ఆమె తెలుగులో నాని కెరీర్‌లో ఓ కొత్త సినిమాలో కథానాయికగా నటిస్తుంది.. ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కానున్నారటా.వైర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెరుకూరి వెంకటమోహన్ అలాగే డా.విజయేందర్ రెడ్డి, మూర్తి కలగర ఈ సినిమా నిర్మిస్తున్నారని సమాచారం.