ఇపుడు ఉన్నా ప్రెసెంట్ టెక్నాలాజిస్ కి సామాజిక మాధ్యమాల కారణంగా ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఫ్యామిలీతో గడుపుతున్న అప్పటి సెలబ్రెటీల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.

ఐతే కొంతమంది నటీనటులు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అలాగే ఇప్పుడు అలనాటి హీరోయిన్ గా పేరు పొందింది. హీరోయిన్ మాధవి గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈమె వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయింది.

ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో పుట్టిన మాధవి అసలు పేరు కనకమహాలక్ష్మి. చిన్న వయసు నుంచి భరతనాట్యం అంటే ఆసక్తి ఉండడంతో తన తల్లి దగ్గర ఈమె శిక్షణ పొందింది. దీంతో ఈమె పలుచోట్ల నాటకాలను ప్రదర్శించింది. దాదాపుగా 300కు పైగా స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నది. ఈమె స్కూలింగ్ డేస్ లో సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది. అబిడ్స్ స్కూల్లో చదువుతున్న సమయంలో ఒకరోజు డైరెక్టర్ దాసరి నారాయణరావు మాధవి చదువుతున్న స్కూలుకి వెళ్లారట. ఆమె నాట్యం చూసి మంత్రముగ్ధులై తాను తీసిన తూర్పు పడమర సినిమాలో మొదటిసారి అవకాశం ఇచ్చారు.

ఆ విధంగా పదమూడు  ఏళ్లకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాధవి వరుస అవకాశాలు వెలువడ్డాయి. చిరంజీవితో ఈమెకు సూపర్ జోడి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైదీ ,బిగ్ బాస్ తదితర వంటి సినిమాలలో చిరంజీవితో నటించింది. ఇక మాతృదేవో సినిమాతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఆధ్యాత్మిక గురువు రామస్వామి భక్తురాలు కావడంతో ఈమె ఆయన చెప్పడంతో బిజినెస్ మ్యాన్ అయిన రాల్ఫ్ శర్మాని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె భర్త కూడా మెడికల్ కంపెనీ తో పాటు రెస్టారెంట్స్ చూసుకుంటూ సక్సెస్ గా పేరు పొందారు. ప్రస్తుతం మాధవి ఆస్తి కొన్ని వేల కోట్లలో ఉందని సమాచారం.

ఏదేమైనా అప్పట్లో చేసిన హీరో హీరోయిన్స్ కి ఈరోజు ఇచ్చే రెమ్యూనరేషియిన్ తో పోలిస్తే తక్కువే కాకపోతే అప్పట్లో దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా పొదపు చేసిన వాళ్ళకి ఇప్పుడు వాటి ఆస్తులు వేల కోట్లలో ఉన్నాయి అనడానికి మాధవిగారు ఒక ఉదాహరణగా చెప్పాచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: