రామ్ చరణ్ విపరీతంగా తన పబ్లిసిటీని పెంచి దానివల్ల హాలీవుడ్ లో అదేవిధంగా బాలీవుడ్ లో తన ఇమేజ్ పెంచుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలలోను ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారంమేరకు చరణ్ ముంబాయికి చెందిన రెండు పిఆర్ ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుని వారిద్వారా తనకు సంబంధించిన రకరకాల ఫోటోలు ఇంటర్వ్యూలు బాలీవుడ్ హాలీవుడ్ కు చెందిన ప్రముఖ పత్రికలలో ఎదోఒక తనకు సంబంధించిన వార్త ఉండేలామేనేజ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

 

 లేటెస్ట్ గా రామ్ చరణ్ కు సంబంధించి మీడియాకు వచ్చిన ఒక ఫోటో పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈఫోటోలో రామ్ చరణ్ చాల స్టైల్ గా ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. పక్కన టేబుల్ మీద ‘ఆర్ ఆర్ ఆర్’ నాటు నాటు పాటకు వచ్చిన గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి రామ్ చరణ్ కు ఈ అవార్డులు రాలేదు.

 

 
ఈ అవార్డులు వచ్చింది కీరవాణి చంద్రబోసు లకు మాత్రమే అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే అదే ఫోటోలో చరణ్ కు వచ్చిన కొన్ని అవార్డులు చరణ్ కళ్ళ దగ్గర రెండువైపుల పెట్టారట. ఒక పక్క ఫిలిం ఫేర్ అవార్డులు మరొక పక్క నందీ అవార్డులు కనిపిస్తూ ఉండటంతో ఆఫోటోను డిజైన్ చేసి తీసిన వ్యక్తి పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఒక నటుడుకి ఫిలిం ఫేర్ అవార్డు అదేవిధంగా నందీ అవార్డు రావడం చాల గౌరవంగా భావిస్తారు.

 

 
అలాంటిది చరణ్ కు వచ్చిన అవార్డులను అతడి కాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి అతడికి రాని అవార్డులను పైన పెట్టి ఫోటోలు తీయడం ఎంతవరకు సమంజసం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈఫోటోలోని అంశాలు చరణ్ పట్టించుకున్నాడో లేదో తెలియక పోయినప్పటికీ ఈఫోటో మాత్రం అనవసరపు నెగిటివ్ కామెంట్స్ కు ఆస్కారాన్ని ఇస్తోంది అంటూ చరణ్ అభిమానులు బాధపడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: