టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా కుటుంబానికి ఉన్నా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐతే వారి ఫ్యామిలీ కి చెందిన మెగా డాటర్ నిహారిక గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె  తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. పెళ్లి అయినప్పటికీ అదే జోష్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది నిహారిక.

ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే నిహారిక జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించడం లేదు.

కనీసం నిహారిక నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ కానీ వార్తలు కానీ వినిపించలేదు. అటు మెగా ఫ్యామిలీ నాగబాబు సైతం నిహారిక గురించి ఎటువంటి వార్తలను విడుదల చేయడం లేదు. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా లో నిలిచే నిహారిక గత కొద్ది రోజులుగా కనిపించకపోవడం పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పింది నిహారిక మద్యలో ఏవో వెబ్ సీరిస్ లకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ నిహారిక నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఇది ఇలా ఉంటే ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత నిహారిక కొత్త అప్డేట్ వచ్చింది. ఉగాది పండుగ సందర్భంగా మెగా డాటర్ నిహారిక నుండి కొత్త అప్ డేట్ వచ్చేసింది. తాను ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. నటిగా చాలా తక్కువ సినిమాలు చేసిన నిహారిక సైరా నరసింహారెడ్డిలో చివరిసారిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ  హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ లను నిర్మించింది. అయితే కొంచెం గ్యాప్ తీసుకున్న నిహారిక ప్రొడక్షన్ తో పాటుగా నటిగా కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని నిహారిక చేసిన పోస్ట్ లో డెడ్ పిక్సెల్ అనే ప్రాజెక్ట్ తో హాట్ స్టార్ లో అలరించనున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిహారిక కూడా నటించనుందట. కాగా త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కూ సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నట్లు ఆమె తెలిపింది. మరి మరోసారి నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న నిహారిక సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.

మెగా ఫ్యామిలీ కి ఉన్నా మంచి పేరు వాళ్ళ కూతుళ్ళ వల్ల డామేజ్ అవుతుంది అనడానికి సోషల్ మీడియా లో చాలా ప్రూప్స్ ఉన్నాయి. ఇకనైనా వాటిని దృష్టిలో పెట్టుకొని వారిఇంటి కూతుళ్లు బిహేవ్ చేయాలనీ మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: