ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలు అన్నీ కూడా రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అలాగే ఒకప్పుడు మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలన్నీ ఇప్పుడు ట్రెండీగా మారుతూ విడుదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ,మహేష్ ,చిరంజీవి, రామ్ చరణ్ తదితర హీరోలు సైతం నటించిన సినిమాలను రీ రిలీజ్ చేసి అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన దేశముదురు సినిమాని 4k లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

వాస్తవానికి ఈ సినిమాని నిర్మించింది డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ. దీనిని పాత ఫార్మాట్ నుంచి మళ్లీ 4k లొకి మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డివి వి దానయ్య ఇప్పుడు ఇలా మార్చడం కోసం  రూ.25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి.. కాబట్టి వాటిని వెనక్కి ఇవ్వాలని అలా చేస్తేనే థియేటర్లకు ఈ సినిమా వేసేందుకు అవకాశం ఇస్తానని అల్లు అర్జున్ అభిమానులకు చెబుతున్నట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ చేస్తున్న సమయంలో వచ్చిన అమౌంట్ అభిమానులు కొన్ని కార్యక్రమాలకు చారిటీ కార్యక్రమాలకు ఉపయోగించబోతున్నట్లు సమాచారం.


కానీ ఇప్పుడు ఈ చిత్రానికి పాతిక లక్షలు స్వయంగా నిర్మాత ఇవ్వమని కోరడంతో ఇది ఎంతవరకు తమకు వర్కౌట్ అవుతుంది అనే విషయం పైన ఇంకా పలు సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తక్కువ షోస్ ఉంటాయి కాబట్టి పాతిక లక్షల మీద డబ్బు కలెక్షన్ చేసి మళ్లీ నిర్మాతకు ఇవ్వడం అనేది కాస్త ఇబ్బందికరమైన అంశమే అన్నమాట వినిపిస్తోంది. మరి ఈ విషయంలో దానయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: