ప్రతి వారం లాగానే వచ్చే వారం కూడా కొన్ని సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. అలా వచ్చే వారం విడుదల కావడానికి రెడీగా ఉన్నా సినిమాలు ఏవో తెలుసుకుందాం.

శాకుంతలం : సమంత ... దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వచ్చే వారం ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

రుద్రుడు : ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లో కొరియో గ్రాఫర్ గా ... నటుడి గా ... దర్శకుడు గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కలిగి ఉన్న రాఘవ లారెన్స్ తాజాగా రుద్రుడు అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... కతరేశన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

విడుదల : విడుదలై పార్ట్ 1 అనే పేరుతో తమిళ్ లో రూపొందిన ఈ మూవీ ని తెలుగు లో ఏప్రిల్ 15 వ తేదీన విడుదల అని పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కమెడియన్ సూరి హీరో గా నటించగా ... విజయ్ సేతుపతిమూవీ లో  ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూడు మూవీ లు వచ్చే వారం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: