పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన.. పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్-k .ఈ సినిమానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని మాత్రం ఇప్పటివరకు అందుకోలేక పోతున్నారు. దీంతో ఈ సినిమా పైన అభిమానులకు భారీ గానే హోప్స్ పెట్టుకున్నారు. ప్రభాస్ వరల్డ్ లెవెల్ లో చేస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా నుంచి తాజాగా నాగ్ అశ్విన్ ఒక అప్డేట్ ను విడుదల చేశారు.


ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్లతో పాటు ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. ఇప్పుడు కూడా మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ క్యాచ్ నుంచి రెండో భాగం అంటూ ఈసారి సినిమాలో రైడర్స్ లుక్కుని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో అనే దాని గురించి వీడియోలు విడుదల చేశారు. ఈ సినిమా ఆర్మీ వారికి విలన్సుకు సెపరేట్ సూట్ ఎలా అరేంజ్ చేశారు అనేదాని గురించి ఈ వీడియోలో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.


సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ వరకు వేచి ఉండాలి. ఇప్పటికే ఈ చిత్రం 70% షూటింగ్ను కూడా పూర్తిచేసుకుంది.ఇక ఈ సినిమా ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం సరైన ఎంపికలను కూడా చిత్ర బృందం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ప్రభాస్ వీటితోపాటు అది పురుష్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: