టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ ఆఖరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. బొమ్మరిల్లు మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో అఖిల్ కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఇలా కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని అందుకున్న అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తూ ఉండగా ... మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులను అమ్మివేసింది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను "పి హెచ్ ఎఫ్" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: