సినిమాలలో నటిస్తే హీరో హీరోయిన్ ల మధ్య ఏదో ఉంది అనే పుకార్లు పుట్టడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధమైన  రూమర్స్ ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతుంటారు.

అయితే తాజాగా పూజా హెగ్డే కూడా ఈ విధమైన రూమర్లపై స్పందించారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న పూజ హెగ్డే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి.

ఇలా వీరిద్దరి గురించి గత కొద్ది రోజులు గా డేటింగ్ రూమర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. ఇక సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే తాజాగా కిసి కా భాయ్ కిసి కా జాన్ అనే సినిమా లో కూడా నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుందట..ఈ క్రమంలో నే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే డేటింగ్ లో ఉన్నారు అనే రూమర్లపై ఘాటుగా స్పందించారు.ఈ క్రమంలోనే డేటింగ్ రూమర్ల పై స్పందించిన పూజ హెగ్డే నేను దాని గురించి అస్సలు ఏం చెప్పగలను... నేను నా గురించి ఇలాంటి వార్తలు గత కొద్దిరోజులుగా చదువుతూనే ఉన్నాను.ప్రస్తుతానికి నాతో నేను ప్రేమలో ఉన్నాను. తాను మనస్ఫూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టానని కూడా తెలిపారు.ప్రస్తుతం నేను వరుస సినిమాలలో నటించడం వల్ల చాలా సిటీస్ జర్నీ చేస్తున్నాను ఇలాంటి సమయంలో తాను కూర్చుని సమాధానం చెప్పలేను అంటూ కొంత పాటి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది.. ఇలా పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ డేటింగ్ రూమర్ల గురించి ఇలా స్పందించడంతో ఇవన్నీ నిజం కాదు అని ఈమె చెప్పేశారు. ప్రస్తుతం పూజ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: