తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న కొరియోగ్రాఫర్ కం యాక్టర్ కం డైరెక్టర్ అయినటు వంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లారెన్స్ ఇప్పటికే ఎన్నో మూవీ ల లోని పాటలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహరించి ... ఎన్నో మూవీ లలో నటించి ... ఎన్నో సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ముఖ్యంగా లారెన్స్ నటుడుగా ముని సిరీస్ మూవీ లతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. హారర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ లు అన్నీ కూడా అద్భుతమైన విజయాలను సాధించడం ... అలాగే ఈ మూవీ లలో లారెన్స్ నటన అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ లతో లారెన్స్ కు అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా లారెన్స్ "రుద్రన్" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో రుద్రుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 14 వ తేదీన తమిళ్ ... తెలుగు భాషల్లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందినప్పటికీ ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలు ... కొన్ని కామెడీ సన్నివేశాలు ... పాటలు అందులోని డాన్స్ లు బాగుండడంతో ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రెస్పాన్స్ లభించింది. దానితో ఈ సినిమాకు తమిళ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో మంచి డీసెంట్ కలెక్షన్ లు మొదటి రోజు లభించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: