ఈ మధ్యకాలంలో తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ... వరుస విజయాలను కూడా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

సంతోష్ శోభన్ హీరో గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రియ కు కూడా పెద్దగా గుర్తింపు లభించలేదు. కాకపోతే తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రం ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. తాజాగా ప్రియ హీరోయిన్ గా నటించిన రుద్రన్ అనే తమిళ సినిమా నిన్న అనగా ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది

 ఈ సినిమా తెలుగు లో రుద్రుడు పేరుతో విడుదల అయింది. ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎల్లో కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన యెల్లో కలర్ బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: