ఏ ఇండస్ట్రీలో నైనా సరే డబ్బింగ్ సినిమాలకు మంచి బజ్ ఏర్పడుతోంది. మొదట కేజిఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత కన్నడ పరిశ్రమ ఒకసారిగా మారిపోయింది. ఆ తర్వాత విక్రాంత్ రొణా కాంతారా, చార్లీ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇతర భాషలలో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి.. మంచి విజయాలను అందిస్తూ ఉన్నాయి. తాజాగా ఆహా కోసం ఎన్నో మలయాళ సినిమాలను తీసుకువస్తున్నారు అల్లు అరవింద్. అలాగే కంతార మూవీను కూడా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ నుంచి తెలుగులోకి విడుదల చేయడం జరిగింది



ఇప్పుడు తాజాగా వెట్రిమారన్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం విడుదలై-1 ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయడం జరిగింది. కమెడియన్ సూరి ఈ సినిమాలో లీడ్ పాత్రలో కనిపించారు.అలాగే విజయ్ సేతుపతి కూడా విలన్ గా నటించారు. తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయినా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లని రాబడుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగులో విడుదలై డీసెంట్ ఓపెనింగ్ రాబట్టింది. మొదటిరోజు ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా పెద్దగా ప్రమోషన్ లేకుండానే.. రూ.1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను చేయడం గమనార్హం.


శాకుంతలం, రుద్రుడు వంటి  మూవీలు డివైడ్  టాక్ రావడంతో మరో వారం రోజులు వరకు ప్రేక్షకులను మెప్పించే సినిమా విడుదల ఒకటే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి  ప్రేక్షకు ఆదరణ పెరుగుతోందని చిత్ర బృందం భావిస్తున్నారు. మరి లాంగ్ రన్ టైంలో ఈ సినిమా కాంతారా స్థాయిలో అద్భుతం చేస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో కాంతారావు సినిమాతో మంచి లాభాలను అందుకున్న అల్లు అరవింద్ ఈ సినిమాతో ఎలాంటి లాభాలను పొందుతారో చూడాలి మరి. ఇక సూరి హీరోగా విడుదల చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: