తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన కమీడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సూరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో తమిళ సినిమా లలో కమెడియన్ పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో గొప్ప కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా సూరి ... వెట్రీ మారన్ దర్శకత్వంలో రూపొందిన విడుతలై పార్ట్ 1 అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ.లో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తమిళ భాషలో కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా తమిళ భాషలో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను ఈ నెల 15 వ తేదీన తెలుగు లో "విడుదల" పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ ని తెలుగు లో అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఇప్పటికే ఈ మూవీ తమిళ భాషలో సూపర్ హిట్ విజయం సాధించడంతో ఈ మూవీ తెలుగు వర్షన్ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి టాక్ రావడంతో మొదటి రోజు ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లభించాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ కి మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: