పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుని ... కొన్ని సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ ... మరి కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వినోదయ సీతం అనే తమిళ మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు . ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నారు. హరిహర వీరమల్లు ... ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లలో ప్రస్తుతం పవన్ పాల్గొంటున్నాడు .

ఇది ఇలా ఉంటే  "ఓజి" అనే మూవీ షూటింగ్ ను పవన్ రేపటి నుండి ప్రారంభించ బోతున్నాడు. ఇలా ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ బిజీ గా ఉన్నా పవన్ ... త్రివిక్రమ్ కథతో సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే మరో మూవీ లో కూడా హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని సుధీర్ అనేక ఇంటర్వ్యూ లలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్ కమిట్ అయిన సినిమాలన్నింటిని నవంబర్ లోపు పూర్తి చేసుకుని నవంబర్ నుండి సుధీర్ సినిమాలో జాయిన్ కావాలి అని ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ "రావణాసుర" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుదీర్ ... పవన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ దర్శకుడు పవన్ తో తీయబోయే సినిమాలో సంగీత దర్శకుడిగా తమన్ ను ఆల్మోస్ట్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: