సినిమాల కోసం ఎక్కువగా లుక్స్ మార్చడం మేకోవర్స్ మార్చడం హీరో హీరోయిన్లకు సులువుగా సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఇది చాలా ట్రెండీగా మారిపోయింది. ఇలాంటి వారిలో ముఖ్యంగా విక్రమ్ కూడ ఒకరు.ఇలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే ఆ పాత్రకు న్యాయం చేస్తూ ఉంటారు. ముందు తరంలో కమలహాసన్ కూడా ఇలాంటి మేకోవర్సు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అలా విక్రమ్ కూడా చేస్తూ ఉంటే కమలహాసన్ని ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్లు చేసేవారు. కానీ ఆ తర్వాత కాలంలో విక్రమ్ పడ్డ కష్టం మార్చిన అవతారాలు చూసి కమలహాసన్ కూడా విక్రమ్ ముందు తక్కువే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.


విక్రమ్ కెరియర్ లో సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. మొదట్లో ఇలాంటి సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలను అందించాయి విక్రమ్ కు.కానీ ఆ తర్వాత కాలంలో విక్రమ్ కెరియర్ ఒక్కసారిగా తలకిందుల అవుతూనే వస్తోంది ఎన్నో సాహసమైన పాత్రలు చేసిన సక్సెస్ కాలేకపోతున్నారు. గత ఏడాది వచ్చిన కోబ్రా సినిమాలు విక్రమ్ పడ్డ కష్టమంతా కూడా ఫెయిల్యూర్ మిగిలింది.


ఇప్పటిదాకా అతని మేకోవర్ ఒక ఎత్తు అయితే.. తంగలాన్ సినిమా కోసం ఈయన మేకవర్ మరొక ఎత్తు అని చెప్పవచ్చు.ఇందులో అటవీ ప్రాంతంలో బతికే ముసలివాడిగా కనిపించబోతున్నారు.. గత ఏడాది ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ప్రజలు అభిమానులు షాక్ అయ్యేలా చేశారు ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన లుక్స్ వీడియో గ్లింప్స్ కూడా మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇన్ని ఫెయిల్యూర్ సచ్చినప్పటికీ కూడా విక్రమ్ మాత్రం తను పడితే కష్టాన్ని మాత్రం వదలలేదు. మరి ఏడాదైన విక్రమ్ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి మరి. ఈ సినిమా షూటింగ్ ఈనెల ఆఖరిలో పూర్తికానంది.కానీ ps -2 ప్రమోషన్ కారణంగా విక్రమ్ మిగిలిన షూటింగ్ అని కాస్త ఆలస్యంగా చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: