డాన్స్ కొరియోగ్రాఫర్ గా ... దర్శకుడిగా ... నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కాంచన సిరీస్ మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా లారెన్స్ "రుద్రుడు" అనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... కతిరేశన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా రుద్రన్ పేరుతో విడుదల కాగా ... తెలుగు లో ఈ మూవీ రుద్రుడు పేరుతో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి తమిళ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ కు సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ను సన్ నెక్స్ట్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను సన్ నెక్స్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ... ఆ తర్వాత కొంత కాలానికి జెమిని టీవీ లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: