‘బొమ్మరిల్లు’ ఘనవిజయం తరువాత బొమ్మరిల్లు భాస్కర్ పేరు మారుమ్రోగి పోయింది. అయితే అతడికి వచ్చిన అంత ఇమేజ్ రామ్ చరణ్ తో తీసిన ‘ఆరెంజ్’ మూవీ మట్టిపాలు చేసింది. ఈమూవీతో భారీ నష్టాలను కొని తెచ్చుకున్న నాగబాబు ఆ షాక్ నుండి బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అని అంటారు. ఈమధ్య జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజునాడు ఈమూవీని మళ్ళీ రీ రిలీజ్ చేసినప్పుడు ఈమూవీకి ఒక్కరోజులో 3 కోట్ల కలక్షన్స్ రావడం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి.


ఈనాటితరం ప్రేక్షకులకు బాగా నచ్చిన ఈమూవీ అప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అన్నవిషయం ఎవరికీ తెలియని విషయంగా మారింది. ఈ విషయం పై ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈసినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. ఈసినిమా విడుదల అయిన తరువాత పవన్ కళ్యాణ్ తనను తన వద్దకు పిలిపించుకుని చెప్పిన విషయాలు గుర్తుకు చేసుకున్నాడు.


‘నువ్వు కథ చెప్పినప్పుడు నాకు నచ్చింది, సినిమా చూసినప్పుడు నాకు నచ్చింది. ఆడటం ఆడకపోవడం అనేవి జరుగుతుంటాయి. నాకు ‘జానీ’ విషయంలో కూడ ఇలాగే జరిగింది. ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్ లో అయిపోయింది. మైండ్ లోకి తీసుకోకు’ అంటూ తనను మానసిక ధైర్యం ఇచ్చి తనకు ఏ సహాయం కావాలి అన్న తనను వచ్చి అడగమని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో మరొక విషయాన్ని కూడ భాస్కర్ గుర్తుకు చేసుకున్నాడు.


‘ఆరెంజ్’ మూవీలో తాను పెట్టిన ‘ట్రూత్ ఆర్ డేర్ గేమ్’ గురించి గుర్తుకు చేసుకుంటూ ఆ గేమ్ గురించి అప్పట్లో అల్లు అర్జున్ తనకు చెప్పినప్పుడు ఆ గేమ్ తనకు నచ్చి ‘ఆరెంజ్’ మూవీలో పెట్టాను అని అంటున్నాడు. ఈమూవీ తరువాత చాల కాలానికి భాస్కర్ తీసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ సక్సస్ అయినప్పటికీ ఇంకా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దశ తిరగలేదు అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: