తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుల్లో ఒకరు అయినటు వంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లే దు. ఇది ఇలా ఉంటే శర్వానంద్ ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ టైమ్ ట్రావెలర్ జోనర్ కథతో రూపొందింది . సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా ... వెన్నెల కిషోర్ ... ప్రియదర్శిమూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

చాలా సంవత్సరాలుగా వరస అపజయాలను ఎదుర్కొంటున్న శర్వానంద్ ఈ మూవీ విజయంతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది . ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమిని టీవీ సంస్థ దక్కించు కుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని జెమిని టీవీ లో ప్రసారం చేయగా ..  ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 2.08 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఇలా ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ మూవీ ని డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మించారు . ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: