పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ లోను ... హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను ... సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" మూవీ లోను హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ ఈ మూడు మూవీ ల షూటింగ్ లలోనూ పాల్గొంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజి" మూవీ షూటింగ్ ముంబై లో స్టార్ట్ అయింది. 

మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే జాయిన్ అయ్యాడు. అలాగే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం ముంబై లో ఈ మూవీ బృందం పవన్ మరియు ప్రియాంక పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక ఫోటోను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఫోటోలో పవన్ కళ్యాణ్ బ్లూ కలర్ లో ఉన్న జీన్స్ ను వేసుకొని ... బ్లూ కలర్ లో ఉన్న షర్ట్ ను వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో జేబులో చేయి పెట్టుకొని నిల్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. "ఓజి" మూవీ ని v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: