టాలీవుడ్ టాలెంటెడ్
హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి మినిమమ్ గ్యారెంటి హీరోగా
అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అలాగే ఫ్యామిలీ
ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతి
హీరో అభిమాని కూడా
అల్లరి నరేష్ ని ఎంతగానో అభిమానిస్తారు. అయితే ఒకప్పుడు
అల్లరి నరేష్ అంటే కేర్ ఆఫ్ కామెడీ.. కానీ ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో. ఈ నేపథ్యంలోనే
కామెడీ ట్రాక్ ని వదిలేసి ఈ మధ్య సీరియస్ సినిమాల బాట పట్టారు.మొన్నామధ్య నాంది మూవీతో మంచి విజయం అందుకున్న ఈయన.. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వచ్చారు. ప్రస్తుతం ఉగ్రం మూవీలో నటిస్తున్నారు
అల్లరి నరేష్. ఈ సినిమాలో
నరేష్ సీఐ శివకుమార్‌గా నటిస్తున్నారు. ఇక అందులో భాగంగానే యాంకర్
సుమ నరేష్‌ను ఇంటర్వ్యూ చేసింది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఇంకా హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ
సినిమా మే 5 వ తేదీన విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఈ
మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ
సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పవర్ ఫుల్
పోలీస్ గా ఈ మూవీలో కనిపించనున్నారు నరేష్. చిన్న పిల్లలు అలాగే పెద్దలు మిస్సింగ్ ను ఛేదించే కథతో ఈ
మూవీ ఉండనుంది. ఇక మిస్ అయినా వాళ్లలో
నరేష్ భార్య, కూతురు కూడా ఉండటం.. వాళ్ళను కాపాడుకోవడానికి
నరేష్ ఏం చేశాడు అనేది ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉండనుంది.ఇక ఈ మూవీలో
నరేష్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.మరోసారి
నరేష్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకోనున్నాడు.
నరేష్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంటోంది. అలాగే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా చాలా హైలైట్ గా ఉండనున్నాయి.ఈ ప్రయోగాత్మక సినిమాతో
అల్లరి నరేష్ ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయంలా అనిపిస్తుంది.