అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... సాక్షి వైద్య ఈ మూవీ లో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది . ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించాడు .

ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం అనేక పాటలను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ నుండి "వైల్డ్ సాల" అనే ఫుల్ సాంగ్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ రోజు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: