తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయినటు వంటి విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి వాటిలో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం విశాల్ తాను నటించిన పందెం కోడి మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. 

మూవీ తో విశాల్ క్రేజ్ కూడా తెలుగు లో పెరిగి పోయింది. దానితో విశాల్ ఆ తర్వాత నుండి తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ కొత్త మూవీ కి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

తాజాగా విశాల్ 34 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం విడుదల చేసింది. విశాల్ కెరియర్ లో 34 వ మూవీ గా రూపొందే సినిమాకు తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వం వహించనుండగా ... ఈ మూవీ ని స్టోన్ బెంజ్ ఫిలిమ్స్ ... జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. విశాల్ ... హరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తమిళ  సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉ న్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: