మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి ఊర్వశి  రౌతేలా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ అనేక సినిమా లలో నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందినటు వంటి వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ అద్భుతమైన విజయం సాధించడం జరిగింది.

దానితో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అలాగే ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ పాటలో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపాడేయడంతో ఈ సాంగ్ తర్వాత ఈ ముద్దు గుమ్మకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఊర్వశి ... రామ్ ... బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది.

అలాగే అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందినటువంటి ఏజెంట్ మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ ఒక సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే యూరప్ లో ఏజెంట్ సినిమా షూటింగ్ సందర్భంగా ఊర్వశి ని హీరో అఖిల్ వేధించాడు అంటూ ఉమైర్ సందు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన ఊర్వసి నువ్వు మెచ్యూరిటీ లేని జర్నలిస్టు వి ... నీ వల్ల నేను మరియు నా కుటుంబం చాలా ఇబ్బంది పడ్డాం. నీవన్ని అసత్య ఆరోపణలు అంటూ ఆయనకు పరువు నష్టం కేసు కింద నోటీసులు పంపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: