సీనియర్ నటులలో ఒకరైన నటుడు శరత్ బాబు గురించి ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా ఈయన తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది..  గత కొంతకాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది .దీంతో ఆయనను బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. శరత్ బాబును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.బెంగళూరు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేయడంతో కొంతమేరకు కోలుకున్న ఈయన మెరుగైన వైద్యం కోసం గడిచిన రెండు రోజుల క్రితం హైదరాబాదులోని AIG హాస్పిటల్ కి తరలించడం జరిగింది.


ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఈయన ఐసీఈ లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈయన ఆరోగ్యం విషమించిందని వైద్యులు అయితే తెలియజేస్తున్నారు.. ఈయన శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కి గురైందని దీంతో ఆయన కిడ్నీ ,ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పాడైపోయినట్లుగా కూడా వైద్యులు ధ్రువీకరించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం శరత్ బాబును వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే కొన్ని గంటలు గడిస్తే కానీ ఈయన ఆరోగ్యం పైన ఎలాంటి విషయం చెప్పలేమని వైద్యులు తెలియజేస్తున్నారు.ఈరోజు సాయంత్రం కూడా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. శరత్ బాబు 1973లో వచ్చిన రామరాజ్యం అనే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టారు ఆ తర్వాత తమిళ్, కన్నడ వంటి భాషలలో దాదాపుగా 250కు పైన సినిమాలలో నటించారు కాకుండా విలన్ గా కూడా పలు సినిమాలలో నటించారు. పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మెప్పించారు శరత్ బాబు. వరుసగా మూడు సార్లు ఉత్తమ సహాయంతోడిగా నంది అవార్డులను కూడా అందుకున్నారు ఈయన.

మరింత సమాచారం తెలుసుకోండి: