తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లను ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటుడు ఆఖరుగా జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అనుదీప్ కే వీ దర్శకత్వం లో రూపొందినటువంటి ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయా న్ని అందుకుంది .

 ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ ప్రస్తుతం మా వీరన్ ... అయాలన్ అనే మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మా వీరన్ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు . తెలుగు లో ఈ సినిమాని మహా వీరుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న రెండు మూవీ లకు సంబంధించిన విడుదల తేదీ లను తాజాగా ఈ మూవీ ల చిత్ర బృందాలు విడుదల చేశాయి.

మొదటగా మా వీరన్ మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు . ఆ తర్వాత నవంబర్ 10 వ తేదీన అయాలాన్ మూవీ ని విడుదల చేయనున్నారు. ఇలా ఈ సంవత్సరం శివ కార్తికేయన్ రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరో గా రూపొందుతున్న ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: