ఇటీవల కాలం లో వైద్య రంగం లో  అధునాతనమైన టెక్నాలజీ అందుబాటు లోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. దీంతో సాధ్యం కానిది అంటూ ఏదీ లేకుండా పోయింది. అయితే ఇలాంటి టెక్నాలజీని తెగ వాడుకోవడానికి ఇష్ట పడుతున్నారు జనాలు. ఈ క్రమం లోనే ఇలా టెక్నాలజీని వాడుకొని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న వారి సంఖ్య రోజుకు ఎక్కువవుతుంది. ముఖ్యం గా ఇటీవల కాలంలో ఎంతో మంది నటి నటులు అటు ప్లాస్టిక్ సర్జరీ లపై ఎక్కువగా ఆధార పడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం.


 తమ ముఖం లో లేదంటే తమ శరీరంలో ఉన్న భాగాలను తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని ఎంతో మంది అనుకుంటున్నారు. ఇలా మార్చుకోవడం ద్వారా తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని ఆశపడుతున్నారు. తద్వారా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా నేటి తరంలో మాత్రం ఎంతో మంది నటులు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వారే ఉన్నారు. అయితే కొంత మంది మాత్రం ఇలా ప్లాస్టిక్ సర్జరీల జోలికి వెళ్లి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా ఇటీవల కాలం  లో వెలుగు లోకి వస్తున్నాయి.


 ఇలా ప్లాస్టిక్ సర్జరీ తో తన అందాన్ని పెంచు కోవాలి అనుకున్న ఒక నటుడుకి ఇలాంటి చేదు అనుభవమె ఎదురయింది. చివరికి ప్రాణం పోయింది. కెనడాకు చెందిన సెయింట్ జోష్ కొలుసి అనే 22 ఏళ్ల కొరియాకు చెందిన నటుడు ఏకంగా ఏడాది లో 12 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఇందుకోసం 1.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అమెరికాకు చెందిన ఒక షోలో జిమీన్ పాత్రలో కనిపించవచ్చని ఈ సర్జరీలు చేయించుకున్నాడు. కానీ సర్జరీలు వికటించడంతో చివరికి చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: