
నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచ ఆడియెన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా వారిపై ప్రశంసల వర్షం ను కురిపించారు.
హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కామెరూన్ మరియు స్టీవెల్ స్పీల్ బర్గ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను పొగిడారు. అలాగే 'గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ 3' డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా గతంలో 'ఆర్ఆర్ఆర్' నటులను బాగా ప్రశంసించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ను ఆయన గుర్తు చేశారు. గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లలో భాగంగా ప్రముఖ ఛానెల్ కు జేమ్స్ గన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఆయన ప్రస్తావించారట . 'గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్ ను పరిచయం చేయాలంటే ఎవరినీ ఎంచుకుంటారు?'.. అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జేమ్స్ గన్ ఎన్టీఆర్ అని బదులివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా అయితే మారింది.
జేమ్స్ గన్ మాట్లాడుతూ… గతేడాది బిగ్ సినిమాగా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' నటుడు.. బోనులోంచి పులులతో బయటికి వచ్చే వ్యక్తితో వర్క్ చేయాలని అయితే ఉంది. ఏదో ఒకరోజు తప్పకుండా వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. అమేజింగ్, కూల్' అంటూ కూడా కామెంట్ చేశారు. అతని కోసం ప్రత్యేకమైన పాత్ర ఉందా? అని అడగగా, ఉందని కూడా చెప్పారు. 'ఇప్పుడే తెలీదు.. దానికి కొంచెం సమయం అయితే పడుతుంది.' అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ స్సై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2లో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు.