తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ పొన్నియన్ సెల్వన్ మూవీ తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ క్రేజ్ ఉన్న తమిళ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించగా ... చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాల ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించారు. ఏ ఆర్ రెహమాన్ ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి సంగీతం అందించాడు.

మొత్తంగా రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. మరి ముఖ్యంగా ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ తమిళ వర్షన్ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని రేపు అనగా ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ చిత్ర బృందం ముగించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళ నాడు ఏరియాలో 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... కేరళ లో 9 కోట్లు ,  హిందీ మరియు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 21 కోట్లు ,  ఓవర్సీస్ లో 50 కోట్లు.  మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 335 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: