అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించగా ... మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.

మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రేపు అనగా ఏప్రిల్ 28 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ ఆచనాలు ఏర్పడ్డాయి. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ... ఏ రేంజ్ లో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

సినిమా నైజాం ఏరియాలో 245 థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ ఏరియాలో 175 థియేటర్ లలో ... ఆంధ్ర లో 330 థియేటర్ లలో విడుదల కానుంది.  మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 750 థియేటర్ లలో విడుదల కానుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 120 థియేటర్ లలో విడుదల కానుండగా ... ఓవర్ సీస్ లో 250 థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1120 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: