అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో కొన్ని భాషలలో మాత్రమే విడుదల చేయడం జరిగింది. గతంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు పూర్తి యాక్షన్ ధ్రిల్లర్ చిత్రంగా ఏజెంట్ సినిమాలో నటించారు.. స్పై త్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కీలకమైన పాత్రలో నటించారు. ఈ రోజున ప్రేక్షకులమ్మ అందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.


రా ఏజెన్సీ ప్రధానపాత్రలో సాగే కథ అన్నట్లుగా తెలుస్తోంది. రా ఆఫీసర్గా మమ్ముట్టి ఒక మాఫియా ముఠాని పట్టుకోవడంలో చాలా విఫలమవుతూ ఉంటారు.. అది చూసిన అఖిల్ వారిని ఎలాగైనా పట్టుకోవాలని అ ఆపరేషన్ ఏజెంట్ ని అఖిల్కి అప్పగించడం జరుగుతుందట. దీంతో అఖిల్ వారిని ఎలా పట్టుకున్నారు అనే కథ అంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఓవర్సీస్ గా ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన ప్రకారం ఈ చిత్రానికి చాలనే నెగటివ్ టాక్ వినిపిస్తోంది  అఖిల్ కి మరొక డిజాస్టర్ తప్పదని కూడా కామెంట్లు చేస్తున్నారు.


మరి కొంతమంది ఏజెంట్ ఆపరేషన్ మిస్ ఫైర్ అంటూ తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ ప్రొడక్షన్ తప్ప మరేం బాగాలేవు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ యాక్షన్ తో మెప్పించిన నటనతో ఆకట్టుకోలేకపోయారని సమాచారం. మొదటి భాగం పర్వాలేదు అనిపించకుండా సెకండ్ పార్ట్ మరింత దారుణంగా ఉందని ఒక చెత్త స్టోరీ అంటూ..VFX ఎలాంటి క్వాలిటీ లేదని సెల్ఫీ క్లైమాక్స్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి సాంగ్స్ బిజిఎం ఏ మాత్రం ఆకట్టుకోలేక ఉన్నాయని అవే మైనస్ అంటూ పోస్ట్ పెడుతున్నారు. ఇక హీరోయిన్ సన్నివేశాలు కూడా కాస్త బోరింగ్ గా అనిపిస్తున్నాయని తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: