ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా చూసిన హాలీవుడ్ మేకర్స్ కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారంటే ఎన్టీఆర్ కి ఏ రేంజ్ లో  క్రేజ్ పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా  గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. 

ఈ క్రమంలోనే కొరటాల శివ సినిమాపై ఏమాత్రం నమ్మకం పెట్టుకోవడం లేదంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం కొరటాల శివ తెరకెక్కించిన గత చిత్రం 'ఆచార్య' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని మూటకట్టుకోవడమే అని అంటున్నారు. ఆచార్య తరహాలోనే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా ఉంటే పరిస్థితి ఏంటంటే కొంతమంది అభిమానులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. అందుకే కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాపై నమ్మకం పెట్టుకోకుండా ఎన్టీఆర్ తదుపరి సినిమా పైనే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండబోతున్న విషయం తెలిసిందే.

సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగొడుతుందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. అటు కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా గురించి ప్రారంభ సమయంలో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో స్వయంగా చెప్పినా కూడా ఫ్యాన్స్ మాత్రం కొరటాల శివ ను అస్సలు నమ్మడం లేదు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా అభిమానులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుతం అభిమానుల ఫోకస్ అంతా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేసే సినిమా పైనే ఉంది. ప్రస్తుతం సలార్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్.. వచ్చే ఏడాది ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: