తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం తాజాగా మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రమేష్ కాడురి దర్శకత్వం వహించగా ... ఆతుల్య రవి ఈ సినిమాలో కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

 ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఏ మాత్రం సక్సెస్ కాలేక పోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్  "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ ఈ మూవీ ని మే 5 వ తేదీ నుండి ఈ మూవీ ని నెట్ ఫ్లీక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ... క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: