టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 'ఊహలు గుసగుసలాడే' అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది రాశిఖన్నా. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగశౌర్య సరసన నటించిన రాశి ఖన్నా తన అమాయకపు నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. అలా తొలి సినిమాతోనే ఆకట్టుకున్న రాశి కన్నాకు ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. దాదాపు యంగ్ హీరోల అందరి సరసన నటించిన ఈమె.. ఆ తర్వాత కొందరు స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరిసింది. తెలుగు తోపాటు అటు తమిళ సినిమాల్లోనూ కూడా మెప్పించింది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో అడుగు పెట్టింది రాశి కన్నా. 

ఇటీవల బాలీవుడ్ లో 'ఫర్ జి' అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ సరసన నటించి ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతోంది. అయితే తన కెరీర్ మొదట్లో రాసి ఖన్నా ఓ సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లి ఆడిషన్ ఇవ్వకుండా పారిపోయిందట. 'మద్రాస్ కేఫ్' అనే సినిమాకు రాసి ఖన్నా మొదట హీరోయిన్గా ఆడిషన్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో చాలామంది సెలబ్రిటీల మధ్య ఆడిషన్ ఇచ్చే ధైర్యం లేక వాళ్ళందరిని చూసి ఒక్కసారిగా భయపడిపోయిందట. దీంతో ఆడిషన్ ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోయిందట. 

కానీ సినిమా మీద ఉన్న గౌరవంతో మళ్ళీ తిరిగి ఆడిషన్ ఇచ్చిందట. దాంతో ఆ సినిమాకు హీరోయిన్ గా రాసి ఖన్నా సెలెక్ట్ అయింది. అలా అక్కడితో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాశి ఖన్నా ఆ తర్వాత సౌత్ లో పలు సినిమాలతో హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోతో నటించినా కూడా ఈ భామకు స్టార్ స్టేటస్ దక్కలేదు. ఇక ఆ తర్వాత సందీప్ కిషన్,రామ్, గోపిచంద్, వరుణ్ తేజ్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ లాంటి పలువురు హీరోల సరసన నటించింది. అయినా కూడా ఈమెకి అనుకున్న స్థాయిలో సక్సెస్ దక్కలేదు. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: