మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పుడు మెగా డాటర్ నిహారిక మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకుంది. హీరోయిన్గా నిహారిక పలు సినిమాల్లో నటించింది కానీ తల్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది నిహారిక. అనంతరం నిర్మాతగా కంటిన్యూ చేస్తోంది.ఈ క్రమంలోనే నిహారిక వైవాహిక బంధం గురించి సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇటీవల నిహారిక ఒక వెబ్ సిరీస్ లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలోనే నిహారిక హీరోయిన్ గా మళ్లీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారాలు సైతం జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా నిహారిక యంగ్ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక వీడియోను కూడా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇకపోతే ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా నటించిన అన్ని మంచి శకునాలే సినిమా ఈనెల 18న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్వప్న సినిమా బ్యానర్ లో నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా సంతోష్ శోభన్ మరియు నిహారిక ఇద్దరు కలిసి సందడి చేశారు. వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియోను తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ అభిమానులకు షేర్ చేశారు వీరిద్దరూ.

సాధారణంగా నిహారిక ఇలాంటి వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇప్పటివరకు లేదు. ఇక అలాంటిది ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా నిహారిక సంతోష్ శోభన్ తో కలిసి డాన్స్ చేసిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరి దృష్టి ఎప్పుడూ వారిద్దరి మీదే పడింది. ఇంకా వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోలో నిహారిక చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అందరూ నిహారిక లుక్ కి ఫిదా అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: