పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు కూడా నడపాలని పలు రకాలుగా ప్లాన్లు వేస్తున్నారు.అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాటిని ముందుకు తీసుకు వెళుతున్నారు. అలాంటి చిత్రాలలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ ఈ మధ్యనే పూర్తి అయ్యింది. హరి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది.



వాస్తవానికి హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ సినిమా పూర్తిచేసి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావోస్తోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశానని అయితే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తాడో  అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వరేమో అని ఇతర పనులలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా షాక్ ఇచ్చారట దాదాపుగా 15 రోజులపాటు ఈ సినిమా డేట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ స్వయంగా తెలియజేసినట్లు సమాచారం.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగ..పవన్ కళ్యాణ్ నెక్స్ట్ షెడ్యూల్ డేట్స్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాకి డేట్స్ కేటాయించడానికి కాస్త సమయం పడుతుందని వార్తలు వినిపించాయి. కానీ ఈ నెల మూడో వారం నుంచి 15 రోజుల డేట్స్ ఖాళీగా ఉన్నాయని షూటింగ్ అప్పుడు పెట్టుకోమని చెప్పారట. దీంతో ఈ సినిమాకు ఊహించని షాక్ తిన్న డైరెక్టర్ హరీష్ శంకర్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను సైతం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లొకేషన్స్ కోసం వెతుకుతున్న హరీష్ శంకర్ డైరెక్టర్ సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: