తాజాగా గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రామబాణం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలు ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రామబాణం సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మిక్స్డ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది  అయితే చాలా రోజులుగా మంచి సాలిడ్ హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. 

అయితే తాజాగా గోపీచంద్ నటించిన రామబాణం సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక హిట్ పడినట్లుగానే కనిపిస్తుంది .ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్గా డింపుల్ హయాతి నటించిన.. వీరిద్దరితోపాటు జగపతిబాబు కుష్బూ కీలకపాత్రలో నటించారు. పూర్తి యాక్షన్ ఫైట్ సినిమాలతో విసిగెత్తి పోయిన ప్రేక్షకులకు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ .వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం లౌక్యం సినిమాల హిట్ కారణంగా వీరిద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.వారిపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకాన్ని నిరోత్సాహపరచకుండా ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇలా ఉంటే ఇక ఈ కథను సిద్ధం చేసుకునేటప్పుడు ఈ సినిమా దర్శకుడు కథకు తగ్గ హీరోను ఎంచుకోవాలి అని అనుకున్నాడట. బాగా పొడవు ఉన్న హీరో అయితే బాగుంటుందని మెగా హీరో వరుణ్ తేజ్ ని అనుకున్నదట. అనుకున్నట్టుగానే కదా పూర్తయిన తర్వాత వరుణ్ తేజ్ కి వినిపించారట శ్రీవాస్. కానీ ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా తో పాటు భారీ ఎమోషన్స్ ఉండడంతో ఆయనకి ఇలాంటి సినిమాలు కలిసి రావన్న ఉద్దేశంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడట వరుణ్ తేజ్ .తను అనుకున్న కథకు సరైన హీరో ఉండాలని వరుణ్ తేజ్ నో చెప్పడంతో అలాంటి పర్సనాలిటీ ఉన్న హీరోని కావాలని  కూర్చున్నాడట శ్రీవాస్. అనంతరం తనకు బాగా కలిసి వచ్చిన గోపీచంద్ ఈ సినిమాకి బాగా సెట్ అవుతాడు అన్న ఉద్దేశంతో గోపీచంద్ తీసుకున్నాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: