మ్యాచో స్టార్ గోపీచంద్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా గోపీచంద్ ఆఖరిగా నటించిన 7 మూవీ లు మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం.

రామబాణం : గోపీచంద్ తాజాగా డింపుల్ హయాతి హీరోయిన్ గా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు 1.17 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ... జగపతి బాబు , కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

పక్కా కమర్షియల్ : గోపీచంద్ హీరో గా రాసి కన్నా హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 2.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సిటిమార్ : గోపీచంద్ హీరో గా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 2.98 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

చాణక్య : గోపీచంద్ హీరో గా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 97 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

పంతం : గోపీచంద్ హీరో గా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు 2.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆక్సిజన్ : గోపీచంద్ హీరో గా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు 1.61 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

గౌతమ్ నంద : గోపీచంద్ హీరో గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు 3.29 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: