పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థ గా కొనసాగుతున్న మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.


మూవీ మొదటి షెడ్యూల్ లో భాగంగా పవన్ ... శ్రీ లీల పై ఈ చిత్ర బృందం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. అలాగే ఈ మూవీ లో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండడంతో మొదటి షెడ్యూల్ లో భాగంగా ఈ చిత్ర బృందం ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్ లో పవన్ పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెండవ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ చాలా తక్కువ రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

 పవన్ ఈ మూవీ కి అనుకోకుండా డేట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ ఫుల్ స్పీడ్ లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ కోసం ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ రేపు అనగా మే 11 వ  తేదీన ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయబోతుంది. ఈ వీడియో పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నిలకోని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: