పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవేస్టెడ్ మోస్ట్ ప్రస్టిజియస్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాల పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణం ఇది వరకే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడమే. గబ్బర్ సింగ్ మూవీ కంటే ముందు చాలా సంవత్సరాల పాటు పవన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుస అపజయాలను అందుకున్నాడు.

మూవీ తో పవన్ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా ఈ మూవీ తో పవన్ వసూలు చేశాడు. ఇలా పవన్ కు గబ్బర్ సింగ్ మూవీ తో సూపర్ సక్సెస్ ఇవ్వడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గబ్బర్ సింగ్ మూవీ కి సంగీతం అందించినటువంటి దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

 దీనితో ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని పనులను ఈ మూవీ యూనిటీ ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ గ్లిమ్స్ వీడియో అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: