గత కొంతకాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా మరియు నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా విజయ్ వర్మ కలిసి పబ్లిక్ గా చాలా చోట్ల కనిపిస్తున్నారు. మొదటగా వీరిద్దరూ గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కలిసి కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న అనుమానాలు  వచ్చాయి .అంతేకాదు దాని తర్వాత ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు ఈ జంట. దాంతో ఆగకుండా గోవా నుండి తిరిగి ముంబై వస్తున్న సమయంలో కూడా వారు కలిసే ఉన్నారు. దీంతో నిజంగానే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న ప్రచారం మొదలైంది .

అయితే తాజాగా వీరిద్దరి డేటింగ్ పై ఒక క్లారిటీ అయితే వచ్చింది. విజయ్ వర్మ సోనాక్షి సింహం నటించిన దాహత్ అనే వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో మెరిసాడు. ఈ నేపథ్యంలోనే మరో నటుడు విజయ్తో తమన్నా రిలేషన్షిప్ గురించి నేరుగా విజయ వర్మను ప్రశ్నించడం జరిగింది. దీంతో విజయ్ వెంటనే సిగ్గుపడుతూనే తాను తమన్నతో డేటింగ్ లో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసాడు. ఇక ఇలా విజయ వర్మ నేరుగా ఒప్పుకోవడంతో ఎప్పటినుండో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అన్న ప్రచారానికి ఇన్నాళ్టికి ఒక క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే హైదరాబాదుకి చెందిన విజయ

 వర్మ సినిమాల్లో నటించడం కోసం మాత్రమే ముంబైకి వెళ్ళాడు. పింక్ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం గల్లీ బాయ్ సినిమాతో పాపులర్ హీరో అయ్యాడు. దాని అనంతరం మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా స్టార్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే ఆయన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తమన్నా విజయ్ వర్మ ఇద్దరూ మొదటిసారిగా లవ్ స్టోరీ 2 షూటింగ్లో కలుసుకున్నారట. దాని అనంతరం వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: